Rohit Sharma: క్రిస్ గేల్‌ను ఆదర్శంగా తీసుకునే సిక్సర్లు బాదా: రోహిత్ శర్మ

chris gayle is his inspiration of scoring hightest sixes in international cricket says rohis sharma
  • క్రిస్‌గేల్‌పై రోహిత్ ప్రశంసలు
  • యూనివర్స్ బాస్ ఒక్కడే, అతడి పుస్తకంలో తానో పేజీ మాత్రమే తీసుకున్నానని వ్యాఖ్య
  • రోహిత్‌కు క్రిస్ గేల్ శుభాకాంక్షలు, 45 జెర్సీ ఉన్న ఫొటో షేర్ చేసిన వైనం
  • జెర్సీలో 4,5 ఉన్నా మనకు 6 అంటేనే ఇష్టమంటూ రోహిత్ సరదా రిప్లై
విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను ఆదర్శంగా తీసుకునే తాను అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచానని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తెలిపాడు. ‘యూనివర్స్ బాస్ ఎప్పటికీ యూనివర్స్ బాస్‌గానే ఉంటాడు. నేను అతడి పుస్తకంలో ఓ పేజీని మాత్రమే తీసుకున్నా. కాకతాళీయంగానైనా మేమిద్దరం ఒకే నెంబర్ జెర్సీని (45) వేసుకుంటాం. అతడి రికార్డును కూడా 45 జెర్సీనే అధిగమించడంతో సంతోషించే ఉంటాడు’ అని రోహిత్ శర్మ తెలిపారు. 

కాగా, అటు క్రిస్ గేల్ కూడా దాదాపుగా ఇదే రెస్పాన్స్ ఇచ్చాడు. ‘అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్‌కు శుభాకాంక్షలు. ఇది 45 ప్రత్యేకం’ అని పేర్కొన్నారు. దీనిపై రోహిత్ సరదా రిప్లై ఇచ్చాడు. ‘మన జెర్సీలో 4,5 నెంబర్లు ఉన్నా మనకు మాత్రం 6 అంటేనే ఇష్టం’ అంటూ కామెంట్ చేశాడు.
Rohit Sharma
Chris Gayle
Cricket

More Telugu News