Cricket: భారత్-పాక్ మ్యాచ్ కోసం వందల సంఖ్యలో నకిలీ టిక్కెట్ల విక్రయం... లక్షల దోపిడీ

Four held for selling fake tickets of October 14 India Pakistan World Cup match in Ahmedabad
  • అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్‌కు యమ క్రేజ్
  • ఒరిజినల్ టిక్కెట్ కొనుగోలు చేసి నకిలీవి ముద్రించిన నిందితులు
  • వందల సంఖ్యలో టిక్కెట్లు అమ్మి లక్షలు దోచుకున్న వైనం
  • నకిలీ టిక్కెట్ల విక్రయం కేసులో నలుగురి అరెస్ట్
భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత క్రేజో చెప్పవలసిన అవసరం లేదు. దాయాదుల పోరు అంటే చాలు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. దీనిని అదునుగా తీసుకున్న కొందరు నకిలీ టిక్కెట్లతో లక్షల రూపాయలు దోచుకున్నారు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబర్ 14న భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల కొనుగోలు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

గాంధీనగర్, అహ్మదాబాద్‌లలోని నలుగురు వ్యక్తులు నకిలీ టిక్కెట్ల మోసానికి పాల్పడ్డారు. మొదట ఈ నలుగురు ఒరిజినల్ టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత అచ్చం అలాగే పదుల సంఖ్యలో నకిలీ టిక్కెట్లను ముద్రించారు. తొలుత 50 టిక్కెట్లను ముద్రించి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత మరో 200 టిక్కెట్లను ముద్రించారు. ఒక్కో టిక్కెట్‌ను రూ.2వేల నుంచి రూ.20వేలకు విక్రయించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు జైమీన్, ధ్రుమిల్, రాజ్ వీర్, ఖుష్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Cricket
sports
India
Pakistan

More Telugu News