Nara Bhuvaneswari: చంద్రబాబు అలా చేసినందుకే తప్పంటే... ప్రజలకు దిక్కెవరు?: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari tweet on chandrababu arrest
  • అసలు చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారని ప్రజలు, కార్యకర్తల్లో ఆవేదన ఉందని వ్యాఖ్య
  • ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినందుకు అరెస్ట్ చేశారా? అని ప్రశ్న
  • ప్రజలు ఆనందంగా ఉండాలి... ఉన్నతంగా జీవించాలని తపించినందుకు జైలుకు పంపించారా? అని ప్రశ్న

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై ఆయన భార్య నారా భువనేశ్వరి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక్కటే ఆవేదన ఉందని, అసలు చంద్రబాబు గారు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు? ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినందుకా? ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా? అదే తప్పు అంటే ప్రజలకు దిక్కెవరు? అని ట్వీట్ చేశారు. CBNJailedForDevelopingAP అని హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News