Chandrababu: చంద్రబాబుకు షాక్.. పీటీ వారెంట్ కు ఆమోదం తెలిపిన ఏసీబీ కోర్టు

ACB Court grants permission for Chandrababu PT Warrant in Fibergrid case
  • ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ పీటీ వారెంట్
  • సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశం
  • ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు పరచాలని ఆదేశాలు
విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరాశ ఎదురయింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు ఆనుమతించింది. సీఐడీ వేసిన పీటీ వారంట్ పై వాదనలను విన్న తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం చేసుకోవచ్చని టీడీపీ లాయర్లకు జడ్జి సూచించారు. కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు.
Chandrababu
Telugudesam
AP Fibergrid Case
PT Warrant

More Telugu News