Balakrishna: 'అన్ స్టాపబుల్ 3' వేదికపై అందాల తారల సందడి!

Unstoppable 3 talk show update
  • ఈ నెల 19న విడుదలవుతున్న 'భగవంత్ కేసరి'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • 'అన్ స్టాపబుల్ 3' వేదికపై సాగిన అల్లరి 
  • ఈ నెల 17న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్
'అన్ స్థాపబుల్ 3' టాక్ షో ఈ నెల 17వ తేదీ నుంచి 'ఆహా'లో మొదలుకానుంది. సీజన్ 1 .. సీజన్ 2 మాదిరిగానే సీజన్ 3కి కూడా బాలయ్యనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షోకి సంబంధించి .. ఫస్టు ఎపిసోడ్ లో ఎవరు ప్రేక్షకుల ముందుకు రానున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' టీమ్ తో ఫస్టు ఎపిసోడ్ నడుస్తుందనే టాక్ వినిపించింది. అందుకు సంబంధించిన షూటింగు జరిగిందనే వార్త కూడా షికారు చేసింది. అందుకు తగినట్టుగానే ఫస్టు ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలను వదిలారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య .. అనిల్ రావిపూడి .. కాజల్ .. శ్రీలీల సందడి చేసినట్టుగా తెలుస్తోంది. లైట్ పింక్ కలర్ డ్రెస్ లో బాలయ్య కనిపిస్తున్నారు. ఎప్పటిలానే ఈ ఎపిసోడ్ లో ఆయన అల్లరి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీలీల స్పెషల్ జ్యుయలరీతో స్టేజ్ పై అందాలు విరబోసింది. సింపుల్ గా కనిపిస్తూనే, తన గ్లామర్ ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని నిరూపిస్తున్నట్టుగా కాజల్ కనిపించింది. అనిల్ రావిపూడి తన మాటల గారడితో ఎలా రచ్చ చేశాడనేది 17వ తేదీనే తెలుస్తుంది.
Balakrishna
Kajal Agarwal
Sreeleela
Bhagavanth Kesari

More Telugu News