ekta kapoor: అడల్ట్ సినిమాలు వద్దన్న నెటిజన్‌కు ఏక్తాకపూర్ కౌంటర్ ఇదీ...!

Ekta Kapoor replie to a netizen asked her to stop making Adult Movies
  • మీరు అడల్ట్ సినిమాలు తీయడం మానేయండన్న నెటిజన్
  • నేనొక అడల్ట్.. అలాంటి సినిమాలే తీస్తానన్న ఏక్తాకపూర్
  • మీరు చాలామందిని చెడగొడుతున్నారన్న నెటిజన్‌
  • 'అవునా?' అంటూ తేలిగ్గా తీసుకున్న ఏక్తా  

నీ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు, మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ వ్యాఖ్యానించిన నెటిజన్‌కు నిర్మాత ఏక్తాకపూర్ నా ఇష్టమున్న సినిమాలు తీస్తానంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 'థ్యాంక్యూ ఫర్ కమింగ్' సినిమా ప్రమోషన్స్‌లో ఆమె నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో నటించిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆస్క్ మి ఎనీథింగ్ అంటూ ఎక్స్ వేదిక పైకి వచ్చారు.

ఈ క్రమంలో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామందిని చెడగొడుతున్నారని, చాలామంది విడాకులకు మీరిద్దరే కారణమని పేర్కొన్నారు. దీనిపై ఏక్తాకపూర్ స్పందిస్తూ... అవునా అని ఒక్కమాటతో వదిలేశారు. ఆ తర్వాత మరో నెటిజన్ దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ... నో, నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News