Ambati Rambabu: ఢిల్లీ బయల్దేరిన... కాదు.. పారిపోయిన నారా లోకేశ్: అంబటి రాంబాబు సెటైర్

Ambati Rambabu satire on Nara Lokesh
  • రెండు రోజుల పాటు సీఐడీ విచారణకు హాజరైన లోకేశ్
  • విచారణ అనంతరం నేడు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరిన టీడీపీ నేత
  • లోకేశ్ ఢిల్లీ టూర్‌పై ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి అంబటి రాంబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి అంబటి రాంబాబు సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా చురకలు అంటించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఆయన నిన్న, ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల విచారణ అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. దీంతో అంబటి రాంబాబు టీడీపీ యువనేత ఢిల్లీ పారిపోయారంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు 'ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్... కాదు... కాదు పారిపోయిన లోకేష్ !' అని పేర్కొన్నారు.
Ambati Rambabu
Nara Lokesh
Chandrababu
YSRCP

More Telugu News