Sajjala Ramakrishna Reddy: పురందేశ్వరికి పొద్దున లేస్తే అదే అజెండా.. చంద్రబాబు లక్కీ అనుకోవాలి: సజ్జల సెటైర్లు

Sajjala ramakrishna reddy satires on purandeswari
  • చంద్రబాబును విడుదల చేయించే ప్రయత్నాల్లో పురంధేశ్వరి ఉన్నారన్న సజ్జల
  • కుటుంబపరంగా అలా చేస్తే తప్పులేదు కానీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారన్న సజ్జల
  • ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పటి నుంచి చంద్రబాబు వెంటే ఎన్టీఆర్ కుటుంబం అని వ్యాఖ్య
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పేరుకే ఆమె బీజేపీ అధ్యక్షురాలని, కానీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ అలాగే చేశారని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్నందున టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఆమె ఎప్పుడూ అండగానే ఉన్నారని ఆరోపించారు. ఆమె కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ ఇలాగే చేశారన్నారు. పొద్దున లేస్తే వారికి ఇదే అజెండా అని, ఢిల్లీకి వెళ్లి చంద్రబాబును అర్జంటుగా ఎలా విడుదల చేయించాలనే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు.

కుటుంబపరంగా ప్రయత్నం చేస్తే తప్పులేదని, కానీ అంతకుముందు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ ఇలాగే చేశారన్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పటి నుంచి నందమూరి కుటుంబం టీడీపీ అధినేత వెంటే ఉంటోందన్నారు. నిజంగా చంద్రబాబు లక్కీ అనుకోవాలా? లేక ఆయన కళనో తెలియదు కానీ ఎన్టీఆర్ కుటుంబం అంతా చంద్రబాబు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటారన్నారు. పైకి ఏదో ప్రభుత్వంపై పోరాటం అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంటుంది కానీ, ఆయనను ఎలా విడుదల చేయాలా? అనే ఆలోచిస్తున్నారన్నారు.
Sajjala Ramakrishna Reddy
Daggubati Purandeswari
Chandrababu
YSRCP

More Telugu News