Madhura Naik: హమాస్ దాడిలో బంధువులను కోల్పోయిన ఉత్తరాది టీవీ నటి

TV Actress Madhura Naik lost relatives in Hamas terror strikes in Israel
  • ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల నరమేధం
  • 900 మందికి పైగా మృతి
  • మృతుల్లో టీవీ సీరియల్ నటి మధుర నాయక్ సోదరి, బావ
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన మధుర నాయక్
ఇజ్రాయెల్ పై ఏళ్ల తరబడి పేరుకుపోయిన పగ, ప్రతీకారాలను హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా బయటపెట్టారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ భూభాగంపై మారణహోమం సృష్టించారు. ఈ భయానక దాడుల్లో 900 మందికి పైగా మృతి చెందారు. 

కాగా, ఇజ్రాయెల్ మృతుల్లో ఉత్తరాది టీవీ నటి మధుర నాయక్ బంధువులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మధుర నాయక్ స్వయంగా వెల్లడించారు. తన కజిన్ సోదరిని, బావను వారి కన్నబిడ్డల ముందే హమాస్ మిలిటెంట్లు చంపేశారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇవాళ వారిద్దరూ శవాలుగా కనిపించారని తెలిపారు. 

ఉగ్రదాడిలో అయినవాళ్లను కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉందని మధుర నాయక్ పేర్కొన్నారు. తన సోదరి, బావ ప్రేమాభిమానాలు మర్చిపోలేనని అన్నారు. ఈ మేరకు మధుర నాయక్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. టెర్రరిస్టుల దారుణాలు ఎలా ఉంటాయో ఇప్పుడందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారని వెల్లడించారు.
Madhura Naik
Relatives
Hamas
Terror Strikes
Israel
Palestine
India

More Telugu News