Bandi Sanjay: కేసీఆర్ కనిపించడం లేదు.. కేటీఆర్ పై అనుమానం కలుగుతోంది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay doubts KTR in KCR matter
  • కేసీఆర్ నుంచే తాను మాటలు నేర్చుకున్నానన్న బండి సంజయ్
  • కేసీఆర్ ను ప్రజలకు చూపించాలని డిమాండ్
  • కేసీఆర్ కనిపించకపోవడం బాధను కలిగిస్తోందని వ్యాఖ్య

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు గురువు అని... కేసీఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వివరాలను వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం తనకు చాలా బాధను కలిగిస్తోందని.. ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు. కేసీఆర్ కనిపించకపోవడంపై... తనకు కేటీఆర్ పై అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ అప్పుల బాధ పోతుందని అన్నారు. బీజేపీ పాలనలో బీసీలకు మంచి జరుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News