Chandrababu: చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ... రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు

TDP supporters send one lakh post cards to president Droupadi Murmu
  • లక్ష పోస్టు కార్డులు రాయాలంటూ పిలుపునిచ్చిన టీడీపీ నేత అప్పలనాయుడు
  • లక్ష పోస్టు కార్డులు స్వయంగా ఢిల్లీలో రాష్ట్రపతి కార్యాలయంలో అందజేత
  • సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ పోస్టు కార్డులపై నినదించిన టీడీపీ మద్దతుదారులు
చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు పంపాలని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల పిలుపునిచ్చారు. ఆ మేరకు వివిధ  వర్గాల ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా సంతకాలు చేసిన లక్ష పోస్టు కార్డులను అప్పలనాయుడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయంలో అందజేశారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ ఆ పోస్టు కార్డులపై రాశారు. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టింది. ఈ పోస్టు కార్డుల నిరసనకు టీడీపీ శ్రేణుల నుంచి భారీగా స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు పోస్టు కార్డులతో చంద్రబాబుకు సంఘీభావం పలికారు.
Chandrababu
Arrest
Post Cards
Droupadi Murmu
President Of India
New Delhi
TDP
Andhra Pradesh

More Telugu News