Akshay Kumar: పాన్ మసాలా యాడ్ వీడియోపై స్పందించిన నటుడు అక్షయ్ కుమార్

Akshay Kumar Clarifies His Return To Paan Masala Ads
  • 2021లో నటించిన అక్షయ్ కుమార్ నటించిన పాన్ మసాలా యాడ్ వైరల్
  • పాన్ మసాలా యాడ్‌లలో నటించనని ప్రకటించాక మళ్లీ వాటి జోలికి వెళ్లలేదని వివరణ
  • రెండేళ్ల క్రితం నాటి వీడియో కాబట్టి ఒప్పందం ప్రకారం 2023 నవంబర్ వరకు ప్రసారం చేసుకోవచ్చునని స్పష్టీకరణ

తాను మళ్లీ పాన్ మసాలా యాడ్స్‌లో నటిస్తున్నట్లుగా చక్కర్లు కొడుతున్న వీడియోపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. ఇలాంటి యాడ్స్‌లో తాను నటించనని ప్రకటించిన అనంతరం వాటి జోలికి పోలేదని ఆయన స్పష్టం చేశారు. అక్షయ్ కుమార్ గతంలో నటించిన ఓ పాన్ మసాలా ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో ఆయన మళ్లీ ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్లుగా ఉన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఆయన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా స్పందించారు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ప్రకటన 2021 అక్టోబర్ నెలలో చిత్రీకరించిందని, అగ్రిమెంట్ ప్రకారం దీనిని 2023 నవంబర్ వరకు ప్రసారం చేయవచ్చునని చెప్పారు. అంతే తప్ప తాను మళ్లీ పాన్ మసాలా యాడ్‌లో నటించలేదని స్పష్టం చేశారు. ఇది ఇప్పుడు చిత్రీకరించింది కాదన్నారు. ఇలాంటి వాటిలో నటించనని తాను బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత మళ్లీ అలాంటి యాడ్స్‌లో పాల్గొనలేదన్నారు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. నిర్దేశిత వ్యవధి వరకు ఆ ప్రకటనను ప్రసారం చేసుకోవచ్చునన్నారు. ఈ పాన్ మసాలా యాడ్ కోసం తీసుకున్న డబ్బును కూడా తాను ఓ మంచి పనికి వినియోగించానన్నారు.

  • Loading...

More Telugu News