Gujarat Police: బిజీ రోడ్డుపై యోగాసనాలు వేసిన యువతి.. మళ్లీ వైరల్ అవుతున్న వీడియో..!

Gujarat Police fines woman after video of her performing yoga on road goes viral
  • సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యువతి ప్రయత్నం
  • జరిమానా విధించిన గుజరాత్ పోలీసులు
  • సారీ చెప్పించి వీడియో ట్వీట్ చేసిన వైనం
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో బిజీ రోడ్డుపై ఓ యువతి యోగాసనాలు వేసింది.. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనుకున్నట్లే వీడియో బాగానే వైరల్ అయింది. అయితే, రియాక్షన్ మాత్రం పోలీసుల నుంచి వచ్చింది. నడి రోడ్డుపై ఏంటీ చేష్టలంటూ మండిపడ్డ పోలీసులు ఆ యువతికి జరిమానా విధించారు. అంతేకాదు, తప్పు చేశానంటూ క్షమాపణ చెప్పించడంతో పాటు మీరు ఇలా చేయొద్దని ఆమెతోనే చెప్పించారు. ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. గుజరాత్ పోలీసులు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

గుజరాత్ కు చెందిన దినా పార్మర్ అనే యువతి రోడ్డుపై యోగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోడ్డుపై ఆమె యోగాసనం వేస్తుండడంతో వెనక పలు వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు వర్షం కురుస్తుండగా నడి రోడ్డుపై ఇలా యోగా చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. రోడ్డు మీద నడిచేటప్పుడే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటే.. ఇలా నిర్లక్ష్యంగా యోగా చేయడమేంటని మండిపడ్డారు. దినా పార్మర్ ను అదుపులోకి తీసుకుని చివాట్లు పెట్టారు. అనంతరం ఫైన్ కట్టించుకుని, పబ్లిక్ కు క్షమాపణ చెప్పించారు.
Gujarat Police
yoga on road
Viral Videos
woman fined
Twitter

More Telugu News