Claudia Goldin: అర్ధశాస్త్రంలో క్లాడియో గోల్డిన్ కు నోబెల్ పురస్కారం

Claudia Goldin wins Nobel Prize in Economic Sciences
  • 2023 ఏడాదికి గాను అర్ధశాస్త్రంలో నోబెల్ అవార్డు ప్రకటన
  • అమెరికా ఆర్థికవేత్తను వరించిన అత్యుత్తమ పురస్కారం
  • మహిళల లేబర్ మార్కెట్ పై అవగాహన పెంపొందించే సిద్ధాంతాలకు విశిష్ట గుర్తింపు
అమెరికా ఆర్థిక చరిత్రకారిణి, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ ను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. అర్ధశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కు క్లాడియా గోల్డిన్ ను ఎంపిక చేశారు. ప్రపంచ మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై అవగాహనను ఇనుమడింపజేసేలా పలు సిద్ధాంతాలకు క్లాడియో గోల్డిన్ రూపకల్పన చేశారు. 

1969 నుంచి 2022 వరకు అర్ధశాస్త్రంలో 54 పర్యాయాలు నోబెల్ పురస్కారం ఇచ్చారు. ఇప్పటివరకు అర్ధశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కు ఎంపికైన మూడో మహిళ... క్లాడియో గోల్డిన్. గతంలో 2009లో ఎలినార్ ఒస్ట్రోమ్, 2019లో ఎస్తేర్ డఫ్లో నోబెల్ అందుకున్నారు. కాగా, ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి వివిధ రంగాలకు నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇవాళ చివరగా అర్ధశాస్త్రంలో నోబెల్ పురస్కార విజేతను ప్రకటించారు.
Claudia Goldin
Nobel Prize
Economic Sciences

More Telugu News