Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో నలుగురిని నిందితులుగా చేర్చిన సీఐడీ

Another four accused included in inner ring road case
  • మాజీ మంత్రి నారాయణ భార్య పేరును చేర్చిన సీఐడీ
  • రావూరి సాంబశివరావు, ఆవుల మణి శంకర్, ప్రమీలపై కూడా కేసులు
  • పలు సెక్షన్ల కింద కేసుల నమోదు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. కొత్తగా మరో నలుగురిని సీఐడీ అధికారులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారాయణ భార్య రమాదేవితో పాటు ప్రమీల, రావూరి సాంబశివరావు, ఆవుల మణి శంకర్ లను నిందితులుగా చేర్చారు. వీరిపై ఐపీసీ 120 బీ, 409, 420, 34,35, 37, 166, 167 రెడ్ విత్ 13 (2) పీఓసీ చట్టంలోని 13 (1) (సీ) (డీ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. 

Inner Ring Road Case
Accused

More Telugu News