Ambati Rambabu: ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందే: మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu responds after YSRCP meet in Vijayawada
  • విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సమావేశం
  • పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశగా కర్తవ్య బోధ చేసిన సీఎం జగన్
  • గేర్ మారింది, స్పీడ్ పెరిగింది అంటూ అంబటి స్పందన
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేపట్టిన వైసీపీ ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. విజయం మనదే అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నూరిపోశారు. ఈ నేపథ్యంలో, మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. పార్టీ ప్రతినిధుల సభతో గేర్ మారింది, స్పీడ్ పెరిగింది అని పేర్కొన్నారు. ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందేనంటూ టీడీపీ, జనసేనలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను తన పోస్టుకు ట్యాగ్ చేశారు.
Ambati Rambabu
Jagan
YSRCP
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News