Raviteja: 'టైగర్ నాగేశ్వరరావు' నుంచి గాయత్రి భరద్వాజ్ ఫస్టులుక్!

Tiger Nageshwara Rao movie update
  • 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ
  • కథానాయికలుగా నుపుర్ సనన్ - గాయత్రి భరద్వాజ్ 
  • సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • ఈ నెల 20వ తేదీన సినిమా విడుదల  

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరావు' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. చాలా కాలం క్రితం స్టూవర్టుపురం దొంగగా అటు పోలీసులకు .. ఇటు ప్రజలకు కునుకుపట్టకుండా చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మితమైన సినిమా ఇది.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలను పెంచుతూ వెళ్లాయి. మాస్ యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో, రవితేజ సరసన నుపుర్ సనన్ కథానాయికగా సందడి చేయనుంది. 'మణి' అనే మరో ముఖ్యమైన పాత్రలో గాయత్రి భరద్వాజ్ కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్టులుక్ లో ఆమె గ్రామీణ యువతిగా మనసులను కట్టిపడేస్తోంది.

రేణు దేశాయ్ కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో అనుపమ్ ఖేర్ ..  నాజర్ .. ప్రదీప్ రావత్ .. మురళీ శర్మ .. జిషు సేన్ గుప్తా కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. దసరా కానుకగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

  • Loading...

More Telugu News