Balakrishna: శ్రీలీలతో సినిమా చేస్తానన్న బాలకృష్ణ.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ మోక్షజ్ఞ వార్నింగ్

Nandamuri Mokshgna Warning to His Father Balakrishna
  • నేను హీరోగా రాబోతుంటే శ్రీలీలతో హీరోగా చేస్తావా అని తిట్టాడట..!
  • భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుకలో వెల్లడించిన బాలకృష్ణ
  • మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం బాలయ్య అభిమానుల ఆసక్తి
టాలీవుడ్ కొత్త సంచలనం.. శ్రీలీలకు తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని భావిస్తే మోక్షజ్ఞ తనను తిట్టాడని బాలకృష్ణ చెప్పారు. ‘ఓవైపు నేను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటే ఆమెకు ఆఫర్ ఇస్తావా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా?’ అని మోక్షజ్ఞ తిట్టినట్లు తెలిపారు. ఈమేరకు తన కొత్త సినిమా భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుక కోసం బాలయ్య వరంగల్ వచ్చారు. ఈ వేదికపై మాట్లాడుతూ.. ఈ సినిమాలో శ్రీలీల తన కుమార్తెగా నటించిందని చెప్పారు. తర్వాతి సినిమాలో హీరోహీరోయిన్లుగా చేద్దామని శ్రీలీలతో చెప్పానని వివరించారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. మోక్షజ్ఞ తనపై మండిపడ్డాడని బాలకృష్ణ తెలిపారు. 

నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017లోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారని బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. అయినా ఇప్పటి వరకూ మోక్షజ్ఞ సినిమాల్లోకి రాలేదు. బాలయ్య తాజా కామెంట్లతో మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని తేలిపోయింది. ఈ దిశగా మోక్షజ్ఞ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా అతిథి పాత్రలో నటించి ఆపై సోలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.
Balakrishna
cinima news
Mokshgna
Bhagavant kesari
Srileela

More Telugu News