ఉగ్రవాదులు, వారి మద్దతుదారులకు కేంద్రంగా కెనడా.. ఈ వీడియోనే రుజువు
- మిస్సిసగా పట్టణంలో హమాస్ కు మద్దతుగా ర్యాలీ
- పాలస్తీనా పతకాన్ని ప్రదర్శించిన యువకులు
- హమాస్ చర్యను ఖండించిన కెనడా ప్రధాని ట్రూడో
భారత్ ఆరోపిస్తున్నట్టు కెనడా ఉగ్రవాదులకు అడ్డాగా మారిందనడానికి ఓ బలమైన నిదర్శనం తాజాగా వెలుగు చూసింది. ఒకవైపు ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడిని కెనడా ప్రధాని ఖండించగా.. మరోవైపు మిస్సిసగా (కెనడాలోని ఓ పట్టణం)లో హమాస్ కు మద్దతుగా కొన్ని మూకలు సంబరాలు చేసుకున్నాయి. కారుపై ర్యాలీ చేశాయి. పాలస్థీనా పతాకాన్ని ప్రదర్శించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హమాస్ మిటిలెంట్ల దాడిలో ఇప్పటికే 700కు పైగా ఇజ్రాయెల్ వాసులు మరణించడం తెలిసిందే. ఇక హమాస్ చర్యలకు మద్దతుగా తుర్కియే, యూరప్ లోని పలు దేశాల్లోనూ ర్యాలీలు జరిగాయి.