Road Accident: దూసుకొచ్చిన మృత్యువు.. బస్సు ఢీ కొట్టడంతో నుజ్జునుజ్జయిన ఆటో

Fatal Accident In YSR Kadapa District That took Four Lives
  • వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
  • లారీని ఓవర్ టేక్ చేసేందుకు ఆటో డ్రైవర్ యత్నం
  • ఎదురుగా వస్తున్న బస్సు వేగంగా ఢీ కొట్టడంతో ఘోరం
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ప్రయాణికులతో వెళుతున్న ఆటో నుజ్జునుజ్జయింది. దీంతో ఆటోను నడుపుతున్న మహిళా డ్రైవర్ సహా మొత్తం నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా.. పోలీసులు వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు నుంచి ఓ ఆటో పది మంది ప్రయాణికులతో మల్లేలకు బయలుదేరింది. ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర్లో లారీని క్రాస్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించగా.. ఎదురుగా వస్తున్న బస్సు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కడప ఆజాద్ నగర్‌కు చెందిన మహమ్మద్ (25), షాకీర్ (10), హసీనా (25), అమీనా (20) లుగా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఘటనా స్థలాన్ని ఎర్రగుంట్ల తహసీల్దార్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు పరిశీలించారు.
Road Accident
Ysr kadapa
Erraguntla
Bus Auto

More Telugu News