Iron Dome: అసలేమిటీ ఐరన్ డోమ్.. ఎలా పనిచేస్తుంది..? వీడియో ఇదిగో!

All about Israels Iron Dome which took on 5000 rockets launched by Hamas
  • గాజాతో నిరంతర సంఘర్షణల నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయెల్
  • ఆకాశంలో దూసుకొచ్చే రాకెట్లను మధ్యలోనే పేల్చేస్తుందంటున్న నిపుణులు
  • తక్కువ ఎత్తులో నుంచి దూసుకొచ్చే వాటిని సమర్ధవంతంగా అడ్డుకుంటుందని వివరణ
ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో చాలా వాటిని ఐరన్ డోమ్ అడ్డుకుంది. కేవలం 22 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించగా.. అందులో మెజారిటీ రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. లేదంటే ఇజ్రాయెల్ భూభాగంలో పెను విధ్వంసం జరిగి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ ఐరన్ డోమ్.. ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

హమాస్ మిలిటెంట్ల పాలనలోని గాజా స్ట్రిప్ నుంచి నిరంతరం సంఘర్షణ ఎదురవడంతో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న యాంటీ మిసైల్ సిస్టమే ఈ ఐరన్ డోమ్.. ఆకాశంలో నుంచి దూసుకొచ్చే రాకెట్లు, ఇతరత్రా క్షిపణులను చాలా ముందుగానే గుర్తించి, వాటిని మధ్యలోనే కూల్చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు. ఇజ్రాయెల్ కు చెందిన రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టం, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి.

ఇదెలా పనిచేస్తుందంటే..
ఐరన్ డోమ్ వ్యవస్థలో మూడు కాంపొనెంట్స్ ఉంటాయి. అవి.. రాడార్, కమాండ్ కంట్రోల్ సిస్టం, ఇంటర్ సెప్టార్

  • ఇజ్రాయెల్ భూభాగంవైపు దూసుకొచ్చే రాకెట్లను రాడార్ సాయంతో గుర్తించడం మొదటి లెవల్ లో జరుగుతుంది.
  • సదరు రాకెట్ పయనించే మార్గాన్ని పరిశీలించి దాని టార్గెట్ ను గుర్తించడంతో పాటు అడ్డుకునేందుకు కమాండ్ కంట్రోల్ సిస్థం ఉపయోగపడుతుంది.
  • కమాండ్ కంట్రోల్ సూచనలతో రాకెట్ పై ఎదురుదాడి చేసేందుకు ఇంటర్ సెప్టర్ పనిచేస్తుంది.

అన్నింటినీ అడ్డుకుని పేల్చేయదు..
ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో అతి కీలకమైన విషయం ఏమిటంటే.. శత్రువులు ప్రయోగించిన రాకెట్ లక్ష్యాన్ని అంచనా వేయడం మాత్రమే కాదు సదరు రాకెట్ తన టార్గెట్ ను చేరగలదా లేదా అనేది కూడా క్షణాలలో లెక్కలేస్తుంది. ఆ టార్గెట్ లో పౌరులు కానీ, కీలకమైన భవనాలు కానీ ఉంటే వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఎదురుదాడి చేసి ఆ రాకెట్ ను మధ్యలోనే కూల్చేస్తుంది. అలా కాకుండా శత్రువుల రాకెట్ ఎంచుకున్న టార్గెట్ చేరినప్పటికీ ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం లేదని తేలితే ఎదురుదాడి చేయదు. అంటే శత్రువుల రాకెట్ ను ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తుంది. దీనివల్ల ఆయుధ నష్టాన్ని నివారిస్తుంది.

Iron Dome
Israel
rocket attack
Hamas

More Telugu News