Boyapati Sreenu: 'కాంతితో క్రాంతి' కార్యక్రమంలో పాల్గొన్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

Boyapati Sreenu participates in Kanth THo Kranthi program
  • చంద్రబాబు అరెస్ట్ పట్ల తెలుగువారి నిరసనలు
  • కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ
  • నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు కొవ్వొత్తులు, దీపాలతో ప్రదర్శన
  • హైదరాబాదులో తన బృందంతో కలిసి కొవ్వొత్తులు వెలిగించిన బోయపాటి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ పిలుపునిచ్చిన మేరకు కాంతితో క్రాంతి కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. కాంతితో క్రాంతి కార్యక్రమం ఈ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు నిర్వహించారు. టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు బోయపాటి శ్రీను కూడా కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చంద్రబాబుకు మద్దతు పలికారు. బోయపాటి శ్రీను హైదరాబాదులో తన బృందంతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా చంద్రబాబుకు సంఘీభావంగా లైట్లు ఆపేసి దీపం వెలిగించడం తెలిసిందే.
Boyapati Sreenu
Kanthi Tho Kranthi
Hyderabad
TDP
Tollywood

More Telugu News