Dharmana Krishna Das: ఏపీ పురోగమించాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి: ధర్మాన కృష్ణదాస్

Jagan to become CM again for APs welfare says Dharmana Krishna Das
  • పేదల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్న ధర్మాన
  • సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు చెప్పాలని సూచన
  • టీడీపీ ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వాన్ని పోల్చి చూడాలన్న ధర్మాన

ప్రజల కోసం వైసీపీ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పేదల కోసం ఎంతో చేస్తున్న వైసీపీకి ప్రజలు మరోసారి అండగా నిలవాలని కోరారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలంటే జగన్ మరోసారి సీఎం కావాలని అన్నారు. గ్రామ వాలంటీర్లు గత నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తమ ప్రభుత్వ పని తీరును గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చి చూడాలని ప్రజలను కోరారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News