KTR: కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పిన మంత్రి కేటీఆర్

Minister KTR reveals why kcr is contestng from kamareddy
  • కామారెడ్డి ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందన్న కేటీఆర్
  • కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంపై అంతటా చర్చ జరుగుతోందని వెల్లడి
  • గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టీకరణ
కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారనే చర్చ సర్వత్రా సాగుతోందని చెప్పారు. అయితే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నారు. నాడు గంప గోవర్ధన్ పార్టీలోకి రావడంతో బీఆర్ఎస్ బలం మరింతగా పెరిగిందన్నారు.

కామారెడ్డి నుంచి పోటీ చేయమని కేసీఆర్‌ను గంప గోవర్ధన్ అడుగుతారని తాను భావించలేదని, ఇప్పటికే అభివృద్ధితో ముందుకు సాగుతోన్న ఈ నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ వన్ చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆయన కోరినట్లు చెప్పారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన ఆశయం ఉంటుందన్నారు.
KTR
Telangana
Kamareddy District
BRS
KCR

More Telugu News