Hardhik Pandya: వరల్డ్ కప్ లో రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్.. టీమిండియాకు మరో షాక్

Hardhik Pandya injured
  • చెన్నైలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్
  • ఇప్పటికే డెంగీ బారిన పడ్డ గిల్
  • తాజాగా హార్ధిక్ పాండ్యా గాయపడినట్టు సమాచారం
2023లో వరల్డ్ కప్ లో టీమిండియా రేపు తన తొలి మ్యాచ్ ను ఆడబోతోంది. చెన్నైలో జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. మరోవైపు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డెంగీ జ్వరం బారిన పడ్డాడు. తాజాగా వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా గాయపడినట్టు సమాచారం. పాండ్యా వేలికి గాయమయినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ సందర్భంగా సిరాజ్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో గాయపడినట్టు సమాచారం. అయితే గాయం అంత పెద్దది కాదని చెపుతున్నారు. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Hardhik Pandya
Team India
World Cup

More Telugu News