Vijayasai Reddy: నేషనల్ మీడియాతో నారా లోకేశ్ బాధ్యతారహితంగా మాట్లాడాడు: విజయసాయిరెడ్డి

Nara Lokesh comments with national media are irresponsible says Vijayasai Reddy
  • ఏపీని గంజాయి రాజధాని అని లోకేశ్ అన్నాడన్న విజయసాయిరెడ్డి
  • గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు ఏపీలోనే ఉన్నాయన్నాడని మండిపాటు
  • రాష్ట్ర ప్రజలను కించపరిచాడని వ్యాఖ్య

టీడీపీ యువనేత నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ గంజాయి రాజధాని అని, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని లోకేశ్ చెప్పాడని వివర్శించారు. ఏపీని, రాష్ట్ర ప్రజలను లోకేశ్ కించపరిచారని మండిపడ్డారు. మీరు ఏపీకి పురస్కారాలు తీసుకురాకపోయినా పర్వాలేదు, కనీసం మమ్మల్ని కించపరచకుండా ఉండండి అని చెప్పారు. సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Vijayasai Reddy
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News