Jana Reddy: ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నా: జానారెడ్డి

Jana Reddy says he will contest in Lok Sabha elections
  • అసెంబ్లీ బరిని వీడిన జానారెడ్డి
  • ఇవాళ మల్లికార్జున ఖర్గేతో భేటీ
  • లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటన
  • జానారెడ్డి కుమారుడికి నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్టు జానారెడ్డి వెల్లడించారు. తన కుటుంబం నుంచి ఒకరు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారని వివరించారు. 

ఇవాళ జానారెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర్గేతో సమావేశం ముగిసిన తర్వాత జానారెడ్డి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేదీ జానారెడ్డి వెల్లడించలేదు. జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. 

అటు, మరో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కూడా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎంపీగా పనిచేసిన మధుయాష్కీ గౌడ్ ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇంకా ఖరారు కాలేదు.
Jana Reddy
Lok Sabha
Congress
Telangana

More Telugu News