Pawan Kalyan: చిత్ర పరిశ్రమ వ్యక్తులు నాకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా తప్పుగా అనుకోను... ఎందుకంటే...!: పవన్ కల్యాణ్

Pawan Kalyan press meet in Mangalagiri
  • మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్
  • చిత్ర పరిశ్రమలో కొందరు తనకు మద్దతుగా ఉండి ఉంటారని వెల్లడి
  • వారు బహిరంగంగా మద్దతిస్తే వైసీపీ నేతలు విరుచుకుపడే అవకాశం ఉందన్న పవన్
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు ఎప్పుడూ కూడా వారి సొంత ఆలోచనలు ఉంటాయని అన్నారు. 

"వారు రాజకీయ నాయకులు కాదు, కొందరికి కొన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి, కొందరు నాకు మద్దతుగా ఉండి ఉంటారు... కాపోతే వారు బయటికి రాకపోవడానికి కారణం ఒక్కటే... వారు నాకు మద్దతుగా ఏదైనా మాట్లాడితే వారిపై వైసీపీ కక్ష సాధింపులకు దిగుతుంది... అందుకే వారు బయటికి రావడంలేదు" అని వివరించారు. 

"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కోట్లాది అభిమానులు ఉన్న రజనీకాంత్ గారు చంద్రబాబుతో ఆయనకున్న సంబంధాల వల్ల పొగిడితే వైసీపీ నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. రజనీకాంత్ అంతటి వ్యక్తిని కూడా వారు వదల్లేదు. అందుకే సినీ పరిశ్రమ వ్యక్తులు నాకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా నేను తప్పుగా అనుకోను" అని పవన్ స్పష్టం చేశారు.
Pawan Kalyan
Cine Industry
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News