Prema Vimanam: 'ప్రేమ విమానం' చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన

Huge response to Prema Vimanam movie trailer
  • సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా ప్రేమ విమానం
  • ముఖ్య పాత్రల్లో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా
  • అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సంతోష్ కాటా దర్శకత్వంలో చిత్రం

సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా,  అనసూయ, వెన్నెల కిశోర్ తదితరులు నటించిన చిత్రం ప్రేమ విమానం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సంతోష్ కాటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజైంది. మనిషి మనిషికో కథ... ఆ మనుషులు కలిస్తే మరో కథ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. వివిధ రకాల పాత్రలు, ప్రేమ, విమాన ప్రయాణం గురించి కలలు కనే చిన్నారులు... ఇలా ప్రేమ విమానం చిత్రం అటు  కమర్షియల్, ఇటు భావోద్వేగాల కలబోతగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. హైదరాబాదులో ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అనసూయ, శాన్వీ మేఘన, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News