Roja: టీడీపీ నేత నారా లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పిన మంత్రి రోజా!

Roja tweets on Chandrababu and Nara Lokesh
  • చంద్రబాబు తాను చేసిన అన్యాయానికి అరెస్టయ్యారన్న రోజా
  • చంద్రబాబు చేసిన అన్యాయాన్ని వైసీపీ గడపగడకూ వెళ్లి చెబుతోందన్న మంత్రి
  • మీ తండ్రి చేసిన అన్యాయం చెప్పడంతో పాటు ప్రజల్ని క్షమించమని అడగమని సూచన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అన్యాయాన్ని చెబుతామని అంటున్నారని, ఇందుకు ఆయనకు థ్యాంక్స్ అని వైసీపీ నేత, మంత్రి రోజా అన్నారు. శుక్రవారం రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామనే ఉద్దేశ్యంతో మాట్లాడబోయి, చంద్రబాబు చేసిన అన్యాయాన్ని అంటూ పొరపాటున మాట్లాడారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ను రోజా ట్వీట్ చేస్తూ, లోకేశ్‌కు థ్యాంక్స్ చెప్పారు.

'చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి ఈరోజు అరెస్టు అయ్యారు, చంద్రబాబు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను దోచుకున్నారో ఆయన చేసిన అన్యాయాన్ని గడపగడపకి వైసీపీ వెళ్ళి తెలియజేస్తుంటే, మేము కూడా గడపగడపకు వెళ్లి ప్రతిమనిషికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని చెబుతామని చెప్పినందుకు థాంక్యూ.. లోకేశ్. ఇప్పటికైనా మీ తండ్రి చేసిన తప్పుల్ని, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడమే కాదు ప్రజల్ని క్షమించమని అడిగితే ఇంకా బాగుంటుంది..!!' అంటూ ట్వీట్ చేశారు.
Roja
Nara Lokesh
Telugudesam

More Telugu News