Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits for straight second day
  • 364 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 108 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతం వరకు లాభపడ్ద బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996కి పెరిగింది. నిఫ్టీ 108 పాయింట్లు పుంజుకుని 19,654 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (5.86%), బజాజ్ ఫైనాన్స్ (4.05%), టైటాన్ (2.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.38%), ఐటీసీ (1.42%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.93%), ఏసియన్ పెయింట్స్ (-0.37%), భారతి ఎయిర్ టెల్ (-0.29%), యాక్సిస్ బ్యాంక్ (-0.26%), ఎల్ అండ్ టీ (-0.13%).

  • Loading...

More Telugu News