Navya Naveli Nanda: ర్యాంప్ వాక్ నేర్చుకో అంటూ అభిమాని సూచన.. అమితాబ్ మనవరాలి స్పందన

Navya Naveli Nanda reacts to Instagram user who asked her to learn ramp walk after her Paris Fashion Week debut
  • ప్యారిస్ ఫ్యాషన్ షోలో నవేలి నందాకు తొలి అవకాశం
  • భయం భయంగా నడవడంతో అభిమానుల నుంచి గట్టి ఫీడ్ బ్యాక్
  • కొంత కష్టపడి అయినా ర్యాంప్ వాక్ నేర్చుకోవాలంటూ సూచనలు
అమితాబచ్చన్, జయా బచ్చన్ మనవరాలు, శ్వేతా బచ్చన్ కుమార్తె నవ్య నవేలి నందా ఇటీవలే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. లోరియల్ బ్రాండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ పై వాక్ చేసింది. ఈ కార్యక్రమానికి తల్లి, అమ్మమ్మ కూడా హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేసే అవకాశం రావడం పట్ల నవేలి నందా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటో షేర్ చేస్తూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంది.

‘‘మహిళల కోసం, మహిళల సాధికారత కోసం ఓ రాత్రి అంకితం చేశాను. ఈ ప్రత్యేకమైన షోలో భాగమయ్యేందుకు అవకాశం కల్పించిన లోరియల్ ప్యారిస్ కు ధన్యవాదాలు. మహిళలకు సురక్షితమైన, పర్యావరణ వ్యవస్థల ఏర్పాటు దిశగా పనిచేసేందుకు అవకాశం రావడం పట్ల గర్వపడుతున్నాను. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ పెద్ద పోస్ట్ పెట్టింది. 

నవేలి నందా పోస్ట్ కు ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘అక్కడ అందరి దృష్టి ఆకర్షించలేకపోయినందున, వచ్చే సారి కోసం ర్యాంప్ వాక్ నేర్చుకునేందుకు కొంత కష్టపడు. ధైర్యంగా ఈ అడుగు వేసినందుకు అభినందించాల్సిందే. మరింత శిక్షణ అయితే అవసరం’’ అని ఓ అభిమాని సూచించగా.. దానికి ఓకే అంటూ నవేలి నందా చేతులు జోడించి నమస్కరించే ఎమోజీ పోస్ట్ చేసింది. నిన్ను చూసి గర్వపడుతున్నానని, భయం లేకుండా నడవాలంటూ తల్లి శ్వేతా బచ్చన్ సూచించారు. దీనికి నవ్యనవేలి లవ్ యూ మామ్ అంటూ రిప్లయ్ ఇచ్చింది. (ర్యాంప్ వాక్ వీడియో)
Navya Naveli Nanda
Amitabh Bachchan
jaya bachan
ramp walk
paris fashion week

More Telugu News