Nara Lokesh: ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్న నారా లోకేశ్

Nara Lokesh reaches vijayawada from delhi
  • ఇరవై రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన లోకేశ్
  • స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి తరలి వచ్చిన కార్యకర్తలు
  • రేపు జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఢిల్లీకి వెళ్లిన టీడీపీ యువనేత ఇరవై రోజులకు పైగా అక్కడే ఉన్నారు. న్యాయవాదులు, జాతీయ నాయకులతో సమావేశమవుతూ బిజీగా గడిపారు. ఈ రోజు ఆయన విజయవాడ చేరుకున్నారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి వచ్చారు. వాహనాలపై వస్తోన్న కార్యకర్తలను మధ్యలోనే పోలీసులు అడ్డగించారు.

దీంతో కార్యకర్తలు తమ వాహనాలను రోడ్డుపై వదిలి, నడుచుకుంటూనే విమానాశ్రయానికి చేరుకున్నారు. యువనేతకు ఘన స్వాగతం పలికారు. లోకేశ్ విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరారు. లోకేశ్ రేపు ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News