కేవలం నోటి మాటలతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందా?: ప్రధాని మోదీకి కేటీఆర్ చురకలు
- మహేశ్వరం నియోజకవర్గంలో అత్యాధునిక విజయ మెగా డెయిరీ
- ప్రారంభించిన కేటీఆర్, తలసాని, సబిత
- ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమీ ఒరగదన్న కేటీఆర్
- కేసీఆర్ నాయకత్వంలో అన్ని రకాల రైతులకు న్యాయం జరుగుతోందని వెల్లడి
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని మోదీ 2014లో చెప్పారని, కానీ రైతుల ఆదాయం ఎక్కడైనా డబుల్ అయిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో రైతుల కష్టాలు డబుల్ అయ్యాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో పాడిరైతులు, రైతుల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.