azharuddin: హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అజారుద్దీన్‌పై అనర్హత

Azharuddin disqualified from hca
  • అనర్హత వేటు వేసిన జస్టిస్ లావు నాగేశ్వర రావు కమిటీ
  • హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరు తొలగింపు
  • హెచ్‌సీఏ నిబంధనలు ఉల్లంఘించారంటూ అనర్హత వేటు
మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు షాక్! హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజార్ వ్యవహరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది.
azharuddin
Cricket
hca

More Telugu News