Nara Lokesh: రాష్ట్ర ప్రజలారా, జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో ఏమేం కోల్పోయారో చూశారా?: నారా లోకేశ్

Nara Lokesh says ys jagan is cancer for rayalaseema
  • జగన్ చేసిన నేరాలు ఆంధ్రప్రదేశ్‌కు ఉరివేస్తున్నాయన్న లోకేశ్
  • అక్రమాస్తుల కేసు నుంచి తప్పించుకునేందుకు హోదా వదులుకున్నాడని వ్యాఖ్య
  • రుషికొండకు గుండు కొట్టిన కేసు నుంచి తప్పించుకునేందుకు రైల్వే జోన్ వదిలేశాడన్న లోకేశ్
  • బాబాయ్ కేసు కోసం పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశాడని ఆరోపణ
  • కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటాను కోల్పోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని హెచ్చరిక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన పాపాలు రాయలసీమకు శాపాలుగా మారుతున్నాయన్నారు. జ‌గ‌న్ చేసిన నేరాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌కి ఉరివేస్తున్నాయన్నారు. అక్ర‌మాస్తుల కేసుల మాఫీ కోసం ప్ర‌త్యేక‌హోదా వ‌దులుకున్నాడని, విశాఖలో రుషికొండకు గుండు కొట్టిన కేసు త‌ప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ కి నీళ్లొదిలాడని, బాబాయ్‌ని చంపించిన కేసులో త‌మ్ముడిని ర‌క్షించుకునేందుకు ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుని ప్ర‌శ్నార్థ‌కం చేశాడని ఆరోపించారు. రాయ‌ల‌సీమ బిడ్డ‌నంటూ క్యాన్స‌ర్ గ‌డ్డలా పీడిస్తున్నాడన్నారు.

జ‌గ‌న్ ప్రభుత్వం దారుణ వైఫ‌ల్యం వ‌ల్లే కృష్ణాజ‌లాల కేటాయింపులు పునఃస‌మీక్ష జ‌రుగుతోందని పేర్కొన్నారు. ప్ర‌జ‌లారా, జ‌గ‌న్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి, రాయ‌ల‌సీమ సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చే కృష్ణాజ‌లాలలో న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా కోల్పోతే, రాయ‌ల‌సీమ ఎడారిగా మారే ప్ర‌మాదం ఉందని హెచ్చరించారు.
Nara Lokesh
YS Jagan
Andhra Pradesh
Polavaram Project

More Telugu News