Ramcharan: ఒకే ఫ్రేమ్‌లో రామ్‌చరణ్, ధోనీ.. అభిమానుల్లో సంబరం!

Ramcharan meets Dhoni on the sidelines of his shoot
  • షూటింగ్ కోసం ముంబై వెళ్లిన గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్
  • టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీతో భేటీ 
  • ధోనీతో దిగిన ఫొటోను షేర్ చేసిన రామ్‌చరణ్
  • దేశానికి గర్వకారణమైన ధోనీని కలవడంపై హర్షం వ్యక్తం చేసిన వైనం

అటు రామ్‌చరణ్.. ఇటు మహేంద్ర సింగ్ ధోనీ. ఒకరు క్రికెట్ అభిమానులకు, మరొకరు సినీఅభిమానులకు ఆరాధ్యదైవం. తాజాగా ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనబడి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ స్వయంగా ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఓ బ్రాండ్ షూట్ కోసం ఇటీవల రామ్‌చరణ్  ముంబై వెళ్లారు. అక్కడ అనూహ్యంగా టీంమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తారసపడగా ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ విషయాన్ని రామ్‌చరణ్ నెట్టింట్ షేర్ చేశారు. భారత్‌కు గర్వకారణమైన ధోనీని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ కామెంట్ చేశారు. 

ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. గ్రీన్ షర్టు‌లో రామ్‌చరణ్, బ్లూ పోలో టీషర్టులో మహేంద్ర సింగ్ ధోనీ స్టైలీష్ లుక్స్ అభిమానులను కట్టిపడేశాయి. ఇద్దరు దేవుళ్లు, ఆల్ టైం గ్రేట్స్ ఒకే ఫ్రేములో కనిపించడం మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చిందంటూ అభిమానులు కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News