Vijayasai Reddy: పసివాళ్ల మెదళ్లలో విషం నింపుతోందంటూ నారా భువనేశ్వరి ఉన్న ఫోటోను షేర్ చేసిన విజయసాయిరెడ్డి

Vijayasaireddy shares a picture with nara bhuvaneswari
  • పసివాడి చేతికి మైక్ ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడిస్తున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం
  • లోకంలో లేని వైఎస్సార్‌ను తిట్టించి శునకానందం పొందుతున్నారని విమర్శ
  • పసి మెదళ్లలోనూ విషం నింపుతూ పైశాచిక ఆనందం పొందడమేమిటో అంటూ ట్వీట్
చిన్నారులతో తిట్టించడం ద్వారా వారి మెదళ్లలో టీడీపీ విషం నింపుతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిర్వహించిన ఆందోళనలో నారా భువనేశ్వరి, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళన సందర్భంగా ఓ చిన్నారికి మైక్ ఇచ్చి మాట్లాడించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన విజయసాయిరెడ్డి టీడీపీపై మండిపడ్డారు. 'అన్నెం పున్నెం తెలియని పసివాడి చేతికి మైక్ ఇచ్చి పెద్ద మాటలు మాట్లాడించి శునకానందం పొందుతున్నారు టీడీపీ నేతలు. ఈ లోకంలో లేని వైఎస్సార్ గారినీ తిట్టిస్తున్నారు. పసి మెదళ్లలోనూ విషం నింపుతూ పైశాచిక ఆనందం పొందడమేమిటో!' అని ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Nara Bhuvaneswari
YSRCP
Telugudesam

More Telugu News