Anasuya: నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి: అనసూయ

Country needs a man like you says Anasuya
  • తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఆసక్తికర ట్వీట్
  • భర్తపై అమితమైన ప్రేమను వ్యక్తం చేసిన అనసూయ
  • నీలాంటి భర్త, కొడుకు, తండ్రి ప్రపంచానికి కావాలని వ్యాఖ్య
టాలీవుడ్ లో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న అనసూయ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. మరోవైపు బుల్లి తెరపై కూడా సందడి చేస్తోంది. అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు నిత్యం వివాదాలతో సహజీవనం కూడా చేస్తుంటుంది. 

తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. నీలాంటి భర్త, నీలాంటి తండ్రి, నీలాంటి కొడుకు, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న... మొత్తానికి నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి అని ఆమె తన భర్తపై ప్రేమను వ్యక్తం చేసింది. తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Anasuya
Tollywood
Husband

More Telugu News