భారత్ యాక్షన్ ప్లాన్ తో దారికొస్తున్న కెనడా
- ప్రైవేటుగా చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించిన కెనడా
- ద్వైపాక్షిక చానళ్లు తెరిచే ఉన్నాయన్న కెనడా విదేశాంగ మంత్రి
- కెనడా దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్ అల్టిమేటం
ద్వైపాక్షిక వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ తో ప్రైవేటుగా చర్చలను కెనడా కోరుకుంటున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య రాయబార చానళ్లు తెరుచుకునే ఉన్నాయని, రెండు వైపులా సంప్రదింపులు కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కెనడాకు ఢిల్లీలో ఎంబసీ, చండీగఢ్, బెంగళూరు, ముంబై లో కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 62 మంది వరకు పనిచేస్తున్నారు. వీరి నుంచి 41 మందిని ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. భారత్ తో వివాదాన్ని కోరుకోవడం లేదని, కలసి బాధ్యతగా పనిచేయాలని అనుకుంటున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో సైతం ప్రకటించారు.