bandaru satyanarayana: బండారు సత్యనారాయణమూర్తికి బెయిల్, విడుదలయ్యాక ఏమన్నారంటే..!

Bandaru Satyanarayana gest bail
  • మంత్రి రోజాను దూషించారంటూ వైసీపీ నాయకుల ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన నగరంపాలెం పోలీసులు
  • ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • రూ.25వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు

టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బెయిల్ మంజూరైంది. మంత్రి రోజాను దూషించారంటూ వైసీపీ నాయకులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, ఈ నెల 2న అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జీజీహెచ్‌లో బండారుకు వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రూ.25వేల పూచీకత్తుపై న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్‌పై విడుదలైన బండారు మాట్లాడుతూ... అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉందని, అదే రాజ్యాంగ ప్రకారం తనకు కోర్టులో న్యాయం జరిగిందన్నారు. ధర్మం గెలుస్తుందని, న్యాయం నిలుస్తుందన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా త్వరలో బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి లోకేశ్ అండగా నిలిచారన్నారు.

  • Loading...

More Telugu News