Dharmana Prasada Rao: చంద్రబాబును ఇంకా అభిమానిస్తున్న వాళ్లను ఎడ్యుకేట్ చేయాలి: మంత్రి ధర్మాన

Dharmana says party cadre should educate who admires Chandrababu still
  • శ్రీకాకుళంలో ఫిష్ ఆంధ్రా స్టాల్ ప్రారంభోత్సవం
  • హాజరైన మంత్రి ధర్మాన
  • ఎన్టీఆర్ ను అభిమానించే మత్స్యకారులు చంద్రబాబుకు మద్దతివ్వడమేంటని వ్యాఖ్యలు

శ్రీకాకుళంలో ఫిష్ ఆంధ్రా మినీ స్టాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను విశేషంగా అభిమానించే మత్స్యకారులు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మత్స్యకారులను హీనంగా చూశారని పేర్కొన్నారు. ఇంకా కొంతమంది అమాయకులు చంద్రబాబును నమ్ముతున్నారని, అలాంటి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. 

నాడు ఎన్టీఆర్ పరిస్థితి గురించి ఎంతో బాధపడిన మత్స్యకారులు ఇంకా చంద్రబాబుకు మద్దతిస్తున్నారని, మత్స్యకార గ్రామాల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని వెల్లడించారు. 

"నాడు ఎన్టీఆర్ ను హింసించి, అవమానించారు... అలా హింసించి, అవమానించడానికి కారకులు ఎవరో మీరు చూసుంటారు. ఇలాంటివన్నీ మత్స్యకారులకు వివరిస్తుండాలి" అంటూ పార్టీ శ్రేణులకు బోధించారు.

  • Loading...

More Telugu News