శ్రీదేవి మరణంపై నన్ను 48 గంటలు విచారించారు: బోనీకపూర్
- భార్య మృతిపై తాజాగా వివరణ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత
- ఎలాంటి కుట్ర లేదని తేలాకే వదిలిపెట్టారని వివరణ
- మంచి శరీరాకృతి కోసం శ్రీదేవి కఠినమైన డైట్ పాటించేదని వెల్లడి
తన భార్య చనిపోవడానికి కారణం ఆమె ఆహార నియమాలేనని భావిస్తున్నట్లు బోనీ కపూర్ చెప్పారు. శరీరాకృతిని అందంగా ఉంచుకునేందుకు ఆమె కఠినమైన డైట్ ను ఫాలో అయ్యేదని తెలిపారు. ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే, అదీ అతి తక్కువ పరిమాణంలో తీసుకునేదని వివరించారు. దీంతో శ్రీదేవి లోబీపీతో బాధపడేదని, తరచూ కళ్లు తిరిగి పడిపోయేదని బోనీ కపూర్ చెప్పారు. వైద్యులు చెప్పినా ఆమె తన ఆహారపుటలవాట్లను మార్చుకోలేదని వివరించారు. ఈ క్రమంలోనే కళ్లు తిరిగి బాత్ టబ్ లో పడిపోయి ఉంటుందని, నీళ్లలో పడడంతో ఊపిరి ఆడక చనిపోయి ఉంటుందని బోనీ కపూర్ చెప్పారు.