Jagan: మహాత్మాగాంధీ కన్న కలల్ని నిజం చేశాం: జగన్

We fulfilled the dreams of Mahatma Gandhi says Jagan
  • నేడు మహాత్మాగాంధీ జయంతి
  • గాంధీకి నివాళులు అర్పించిన జగన్
  • సచివాలయ వ్యవస్థ ద్వారా నిజం చేశామన్న సీఎం
నేడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. మహాత్మాగాంధీ మాటలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని చెప్పారు. గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామని తెలిపారు. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తామని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.
Jagan
YSRCP
Mahatma Gandhi

More Telugu News