Ileana DCruz: మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న నటి ఇలియానా.. అప్పుడే రెండు నెలలైందంటూ పోస్ట్

Ileana DCruz shares cute photo with son Koa Phoenix Dolan
  • ఆగస్టు 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
  • చిన్నారిని ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన నటి
  • ప్రస్తుతం విద్యాబాలన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న ఇలియానా
ఇటీవల తల్లి అయిన సినీ నటి ఇలియానా ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ గడుపుతున్నారు. తాను గర్భవతినంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించి అందరినీ షాక్ కు గురిచేసిన ఆమె రెండు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా బాబును ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అప్పుడే రెండు నెలలు అయిపోయిందని పేర్కొన్నారు. 

తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచాడంటూ పలుమార్లు తన బాయ్‌ఫ్రెండ్ ఫొటోను షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా దాగుడుమూతలు ఆడిన ఇలియానా.. చాలా రోజుల తర్వాత అతడి ముఖాన్ని చూపిస్తూ ఫొటో షేర్ చేసి అభిమానులకు పరిచయం చేశారు. అతడి పేరును మైఖేల్ డోలాన్‌గా పేర్కొంది. కాగా, ఆగస్టు 1న జన్మించిన బాబుకు కొయా ఫినిక్స్ డోలాన్ అని నామకరణం చేశారు.

తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లారు. అయితే, అక్కడామెకు అనుకున్నంతగా కలిసిరాలేదు. ప్రస్తుతం విద్యాబాలన్‌తో కలిసి ఆమె ఓ సినిమా చేస్తున్నారు.
Ileana DCruz
Tollywood
Bollywood
Koa Phoenix Dolan
Michael Dolan
Viral Pics

More Telugu News