Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి కీలక నిర్ణయం.. బస్సు యాత్రకు సిద్ధమవుతున్న చంద్రబాబు అర్ధాంగి!

Chandrababu wife Nara Buvaneswari to take up Nara Bhuvaneswari
  • టీడీపీలో శరవేగంగా చోటుచేసుకుంటున్న సరికొత్త పరిణామాలు
  • పార్టీని నడిపించేందుకు సిద్ధమవుతున్న భువనేశ్వరి, బ్రాహ్మణి
  • ఈ నెల 5 నుంచి కుప్పం నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీలో ఊహించని పరిణామాలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. యువనేత లోకేశ్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండటంతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు పార్టీని ముందుండి నడిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్రను బ్రాహ్మణి కొనసాగించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు బస్సు యాత్రకు భువనేశ్వరి సిద్ధమవుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. తొలి విడత బస్సు యాత్ర రాయలసీమ జిల్లాల్లో కొనసాగనుంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ గాంధీ జయంతి అయిన ఈరోజు భువనేశ్వరి ఒకరోజు నిరాహారదీక్షను చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News