GST: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లపై కేంద్రం ప్రకటన

Center reveals GST details for the month of September
  • గత నెలలో రూ.1.62 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
  • గతేడాది సెప్టెంబరు వసూళ్ల కంటే 10 శాతం వృద్ధి 
  • రూ.1.6 లక్షల కోట్లు దాటడం ఈ ఏడాది నాలుగోసారి
గత నెలలో వసూలైన జీఎస్టీ వివరాలను కేంద్రం వెల్లడించింది. సెప్టెంబరు మాసంలో రూ.1.62 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే వసూళ్లలో 10 శాతం వృద్ధి నమోదైంది. 2022 సెప్టెంబరులో రూ.1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. కాగా, జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు దాటడం ఈ ఏడాది ఇది నాలుగోసారి. 

సెప్టెంబరులో కేంద్ర జీఎస్టీ రూ.29,818 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.37,657 కోట్లు. సమీకృత జీఎస్టీ రూ.83,623 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలైన రూ.41,145 కోట్లను కలుపుకుని) అని కేంద్రం వెల్లడించింది. ఇక, సెస్ రూపంలో రూ.11,613 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలైన రూ.881 కోట్లను కలుపుకుని) వసూలయ్యాయి.
GST
September
Collection
India

More Telugu News