raghuveera reddy: చంద్రబాబు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రఘువీరారెడ్డి

Raghuveera Reddy hot comments on Chandrababu arrest
  • బీజేపీ ఒత్తిడి కారణంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్న రఘువీరా
  • జగన్ ప్రభుత్వం భుజాలపై తుపాకి పెట్టి బీజేపీ వ్యవహారాలు నడిపిస్తోందని వ్యాఖ్య
  • ఏపీలో టీడీపీ స్పేస్‌ను బీజేపీ ఆక్రమించాలనుకుంటోందన్న కాంగ్రెస్ నేత
బీజేపీ ఒత్తిడి కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం భుజంపై తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలోనే ఉన్నాయన్నారు. అక్కడే పరిష్కరించుకోవాలన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకే పురందేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించారన్నారు. వీటన్నింటికి కారణం ఏపీలో బీజేపీ బలపడాలన్నదే ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు.

బీజేపీ అనే అనకొండ కోరల్లో చంద్రబాబు ఇరుక్కున్నారన్నారు. బీజేపీకి తెలియకుండా, ప్రధాని, హోంమంత్రికి తెలియకుండా ఏపీలో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేస్తుందని తాము అయితే భావించడం లేదన్నారు. నూటికి నూరుపాళ్లు బీజేపీ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందన్నారు. వారి ఆశీస్సులు లేకుంటే ఇవి జరిగేవి కావని తాను నమ్ముతున్నానని చెప్పారు.

ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టులను పక్కన పెడితే మిగిలిన పార్టీలన్నీ జీహుజూర్ అనే పార్టీలు అన్నారు. అందరూ బీజేపీ ఆశీస్సుల కోసం సాగిలపడేవారన్నారు. టీడీపీని బలహీనపర్చడం ద్వారా బీజేపీ ఎదగాలనుకుంటోందన్నారు. ఈ పద్ధతిని బీజేపీ చాలా రాష్ట్రాల్లో అనకొండ మాదిరి అలోచిస్తుందన్నారు.
raghuveera reddy
Chandrababu

More Telugu News