Allu Arjun: అర్థాంగి స్నేహారెడ్డి పుట్టినరోజున స్పెషల్ వీడియో పోస్టు చేసిన అల్లు అర్జున్

Allu Arjun posts special video on his wife Allu Sneha Reddy birthday
  • నేడు అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు
  • హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ విషెస్ తెలిపిన బన్నీ
  • ఓ వీడియోతో అర్ధాంగిని సర్ ప్రైజ్ చేసిన వైనం
ఇవాళ (సెప్టెంబరు 29) టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహారెడ్డి పుట్టినరోజు. ప్రస్తుతం కుటుంబ సమేతంగా లండన్ ట్రిప్ లో ఉన్న అల్లు అర్జున్... భార్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో పోస్టు చేశారు. 

వివిధ ప్రదేశాల్లో స్నేహారెడ్డి ఉన్నప్పటి దృశ్యాలు, ఆమె మాటలను రికార్డు చేసి ఓ ఆల్బమ్ తరహాలో రూపొందించి బర్త్ డే సందర్భంగా వీడియో పంచుకున్నారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ... నా జీవితానికి వెలుగువు నువ్వే అంటూ స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బన్నీ పంచుకున్న  ఆ వీడియోలో కొన్నిసార్లు స్నేహారెడ్డికి తెలియకుండానే షూట్ చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. 

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తున్నారు. కొన్నిరోజుల కిందటే షూటింగ్ కు విరామం ప్రకటించి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి లండన్ వెళ్లారు.
Allu Arjun
Allu Sneha Reddy
Birthday
Video
Icon Star
Tollywood

More Telugu News