Pattabhi: న్యాయ వ్యవస్థలపై మాకు నమ్మకం ఉంది: పట్టాభి

Pattabhi said TDP has faith in judiciary system
  • చంద్రబాబుపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడలేక అక్రమాలు చేస్తున్నారన్న పట్టాభి
  • లోకేశ్ పాదయాత్రను కూడా అడ్డుకునేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణ
  • చంద్రబాబు తప్పకుండా బయటికి వస్తారని ధీమా

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడలేక జగన్ అక్రమ మార్గంలో వెళుతున్నారని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రను కూడా అడ్డుకోవాలని అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రజలు జగన్ ను ఛీకొడుతున్నారని అన్నారు. 

తమకు న్యాయవ్యవస్థలపై నమ్మకం ఉందని, చంద్రబాబు తప్పకుండా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ను అధికార పీఠం నుంచి దించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని పట్టాభి స్పష్టం చేశారు. 

జగన్ ఇటీవలే పదేళ్ల జైలు వార్షికోత్సవం జరుపుకున్నాడని, అవినీతి కేసుల్లో ఉన్న జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నాడని పట్టాభి వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నెట్టివేసిందని అన్నారు.

  • Loading...

More Telugu News